Monday, December 23, 2024

ఐడిపిఎల్, హెచ్‌ఎంటి భూములను రక్షించండి

- Advertisement -
- Advertisement -
గవర్నర్ తమిళ సైకి మేడ్చల్ జిల్లా బిజెపి నేతల ఫిర్యాదు

హైదరాబాద్ : జిల్లాలోని ఐడిపిఎల్, హెచ్‌ఎంటి కంపెనీలకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయని మేడ్చల్ జిల్లా బిజెపి నేతలు గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్‌కు ఫిర్యాదు చేశారు. 5 వేల కోట్ల విలువైన హెచ్‌ఎంటి, ఐడిపిఎల్ భూముల ఆక్రమణకు సంబంధించి బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి నేతృత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న కంపెనీలకు చెందిన విలువైన భూములను స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు కబ్జాలు చేసి, అమ్ముకుంటున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఐడిపిఎల్, హెచ్‌ఎంటి కంపెనీలు ఉన్న ప్రాంతంలో ఎకరానికి రూ.30 కోట్ల ధర పలుకుతోందని, ఆ భూములను కాపాడాలని కోరారు.

కంపెనీలకు చెందిన భూ కబ్జాలపై స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని మల్లారెడ్డి చెప్పారు. ఈ రెండు కంపెనీలకు మొత్తం 880 ఎకరాల భూమి ఉందని, ఐడిపిఎల్ కంపెనీలో వంద ఎకరాలు, హెచ్‌ఎంటి కంపెనీకి చెందిన 50 ఎకరాల భూమిని స్థానిక నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూములను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భూములను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను వారు కోరారు. కార్యక్రమంలో బిజెపి నేతలు డాక్టర్ ఎస్. మల్లా రెడ్డి, బక్క శంకర్ రెడ్డి, గార్గే శ్రీనివాస్, లక్ష్మీపతి రాజు, శ్రీధర్ వర్మ, కేశవ్ యాదవ్, రవి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News