Sunday, December 22, 2024

మొక్కలు నాటి పర్యావరణాన్నీ కాపాడుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • ఎస్‌పి రమణకుమార్

సంగారెడ్డి: అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపొదించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎస్‌పి రమణకుమార్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో 9వ విడత హరిత హారంలో భాగంగా ఎస్‌పి రమణకుమార్ పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్‌పి రమణకుమార్ మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఇంటిలో పొలాల గట్లపై మొక్కలు నాటాలని, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌ల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్నారు. గ్రీనరీలో సంగారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతిఒక్కరూ హరిత హారంలో భాగస్వాములై మొక్కలు నాటాలని సూచించారు.

ప్రభుత్వ లక్షానికి మించి మొక్కలు నాటి అందరిని ఆక్షర్యపరిచేలా మొక్కలను పెంచాలన్నారు. మొక్కల పెంపకమే కాదు వాటిని నీరు పోసి సంరక్షించాలని కోరారు. మొక్కలు పెంచడంతో వర్షాలు, పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చదనం, స్వచ్చమైన వాతావరణం అందించినవాళ్లమవుతామన్నారు. మానవ జాతికి మొక్కలే ఆధారమన్నారు.ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పి ఉషా విశ్వనాథ్, డిఎస్‌పి రవీంద్రారెడ్డి, డిసిఆర్‌బి డిఎస్‌పి బాలాజీ, ఎఆర్‌డిఎస్‌పి జనార్దన్, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ మహేష్‌గౌడ్ సిఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News