Wednesday, January 22, 2025

మొక్కలను సంరక్షించుకోవాలి

- Advertisement -
- Advertisement -

వాంకిడి: రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ అన్నారు. శనివారం మండలంలోని సరండి గ్రామంలో పర్యటించి, గ్రామంలో ప్రధాన రోడ్డు ఇరువైపుల నాటుతున్న హరితహారం మొక్కల ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణంలో సమతుల్యత ఏర్పడి విస్తారంగా వర్షాలు పడుతాయని చెప్పారు. దీంతో భవిష్యత్తు తరాలకు ఎంతైన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారం మొ క్కలు నాటా వాటిసి సంరక్షించే బాధ్యతను ప్రజలందరూ తీసుకోవాలని కోరారు.

కుమ్రంభీం ప్రధాన కాలువను అనుకోని మొ క్కలు నాటడంతో పాటు 10 రోజుల్లో హరితహారం మొక్కలు నాటేపని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఇందాని, తేజాపూర్ గ్రామాల్లో చేపట్టిన హరితహారం పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సరండి సర్పంచ్ కమాలకర్, ఎంపిడిఓ వెంకటేశ్వ ర్‌రెడ్డి, ఎంపిఓ శివ్‌కుమార్, ఈజిఎస్ ఎపిఓ శ్రావణ్‌కుమార్, ఐకేపి ఎపిఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News