Monday, December 23, 2024

గ్రామీణ ఉపాధి హామీ రక్షణ కోసం

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 18 హైదరాబాదులో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి’

upadi hami pathakam
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల కుదింపు , తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 18న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బి.కె.ఎం.యు, ఎ.ఐ.డబ్లు.యు, డి.బి.ఎఫ్, పి.ఎం.సి రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని బి.కె.ఎం.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల మల్లేష్, ఎ. ఐ. డబ్లు.యు జాతీయ కమిటీ సభ్యులు బి. ప్రసాద్, బి.కె.ఎం.యు రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య తెలిపారు. బి.కె.ఎం.యు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉమ్మడి సమావేశంలో బి.కె.ఎం.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల మల్లేష్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను , నిధులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పథకం ప్రకారం నీరుగార్చే చర్యలు చేపట్టింది అన్నారు. కేంద్ర బడ్జెట్ లో రూ 25 వేల కోట్లు కుదించిందని నిరు పేదలు వాడే నిత్యావసర సరుకుల ధరలు, వంటగ్యాస్ ,పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ బతుకు భారంగా మారుస్తోందన్నారు.

పెరుగుతున్న ధరలకనుగుణంగా రోజు వేతనాలను పెంచడం లేదు. పని చెసిన దగ్గర కొలతల పేరుతో వేతనాలను కు దిస్తున్నారు అన్నారు. పని దినాలు కుటుంబ సభ్యులకు అందరికీ కలిపి 100 రోజుల పని కల్పన వలన పనిదినాలు సరిపడా లేక వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పనులను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులకు మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్‌ల ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి, రోజుకు ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని, పట్టణ పేదలకు పనిని విస్తరింపజేయాలి. అదే విధంగా పని చేసే చోట మౌలిక వసతులు కల్పించాలని, టెంట్లు, పనిముట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 18న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సదస్సుకు అన్ని జిల్లాల నుండి పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News