Friday, November 22, 2024

చిన్నారులకు ప్రోటీన్ ఫుడ్ : హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Protein food give to children's by satya sai annapurna trust

సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సున్న ప్రతి చిన్నారికి ఉచిత ప్రోటీన్ పుడ్ అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేట పట్టణం ఇందిరా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజవర్గం లోని పేద చిన్నారులకు ఉచితంగా ప్రోటీన్ ఫుడ్ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ  మంత్రి హరీశ్ రావు ప్రారంభించిoచారు.  200 మంది చిన్నారులకు తొలి డోస్ ప్రోటీన్ ఫుడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించి వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలన్న సదాశయంతో సాయి బాబా ఆశీస్సులతో సత్య సాయి సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమం చేపట్టిందని ప్రశంసించారు. తెలంగాణలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నా సిద్దిపేట చిన్నారులకు ప్రోటీన్ ఫుడ్‌ను ట్రస్ట్ వారు అందజేస్తున్నారన్నారు. ఇందుకు కారణం తన మీద, సిద్దిపేల ప్రజల మీద ఉన్న నమ్మకమేనని ఆ నమ్మకాన్ని నిలబెడదామన్నారు.  సిద్దిపేట జిల్లాలో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సున్న పేద పిల్లలు ఐదు వేల మందిని ఉన్నట్లు గుర్తించామని హరీష్ వెల్లడించారు.  ధర్డ్ వేవ్ వస్తుందని, చిన్నారులకు ప్రమాదం అన్న వార్తలు వస్తున్నాయని,  ఏది వచ్చినా చిన్నారులు‌ తట్టుకునేలా ప్రతి చిన్నారికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.

తొలి నియోజకవర్గం సిద్దిపేటనే

3 నుంచి 6 సంవత్సరాల వయస్సున చిన్నారుల్లో రోగ నిరోధక వ్యవస్థ ను పెంపొందించేందుకు సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాండిచ్చేరి, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్ర లలో “సాయి సూర్” పేరుతో న్యూట్రీషన్ పౌడర్ ను అందిస్తున్నామన్నారు. న్యూట్రీషన్ పౌడర్ పంపిణీకి ముందు తర్వాత చిన్నారుల్లో మార్పులను అధ్యయనం చేయగా పౌడర్ ఇచ్చిన తర్వాత చిన్నారుల్లో ఇమ్మ్యూనిటి పవర్ పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైందన్నారు.  దీంతో ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట నియోజకవర్గంలో  చేపట్టాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధులను కోరారు. స్పందించిన ట్రస్ట్ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం లో సిద్దిపేట నియోజవర్గం లో తొలిసారిగా “సాయి సూర్” పేరుతో ప్రయోగాత్మకంగా న్యూట్రీషన్ పౌడర్ పంపిణీ కార్యక్రమం ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ పాల సాయిరాం, డిడబ్ల్యుఒ రామ్ గోపాల్, సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News