- Advertisement -
నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారకొండ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బైపాస్ రహదారి నిర్మాణం కోసం జీవో జారీ చేసి చారకొండలో రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టారు. జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారిపై 29 ఇళ్లు కూల్చివేస్తుండటంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు. గ్రామం మధ్యలో నుంచి బైపాస్ తీసుకెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో దాదాపు 400 మందికి పైగా పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు.
నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలుస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -