Wednesday, January 8, 2025

ఇథనాల్‌పై యుద్ధభేరి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ సమీపంలో జాతీయ రహదారిపై
బైఠాయించిన గ్రామస్థులు
పురుగుల మందుతో ధర్నాలో పాల్గొన్న మహిళలు 
రోడ్డుపైనే వంటావార్పు 
ఆర్‌డిఒ రత్న కల్యాణికి నిరసన సెగ

మన తెలంగాణ/దిలావర్పూర్: నిర్మల్ జిల్లా, దిలావర్పూర్‌గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మంగళవారం 61వ నెంబర్ జాతీయ రహదారిపై ఆయా గ్రామాలతోపాటు చుట్టుపక్కల ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో చేరుకొని బైఠాయించారు. ఉదయం నుండి రాత్రి వరకు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలో కూర్చున్నారు. ఈ ఆందోళనతో 10 కిలోమీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. భైంసా నుండి వచ్చే వాహనాలను కల్లూర్, నర్సాపూర్ గ్రామాల నుండి నిర్మల్ వెళ్లడానికి మళ్ళించారు. నిర్మల్ నుండి భైంసా వెళ్లే వాహనాలను నాలుగు సిరివాపూర్ గ్రామం వద్ద నిలిపివేశారు. దీని వల్ల వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బంది ఏర్పడింది. ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో రోడ్డుపై బైఠాయించడంతో ఎస్‌పి జాన కి షర్మిల ఆధ్వర్యంలో ప్రజలకు ఇబ్బంది క లుగకుండా అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. ధర్నాలో కూర్చున్న మహిళలు విషపూరిత మందులను వెంట తెచ్చుకొని ఫ్యాక్టరీ రద్దు చేయాలని, లేనిపక్షంలో పురుగుల మందు తాగి చనిపోతామని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించా ల్సి వస్తుందని నినాదాలు చేశారు.

ధర్నా చేస్తున్న రైతులు, ప్రజలతో మాట్లాడడానికి నిర్మల్ ఆర్‌డిఒ రత్నకళ్యాణి చేరుకొని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే ధర్నా వి రమించాలని కోరారు. ఆమె ఎంతచెప్పినా రై తులు వినకపోవడంతో తిరిగి వెళ్లడానికి ప్రయత్నించిన ఆర్‌డిఒను రైతులు అడ్డుకొని వెళ్లకుండా రోడ్డుపై అడ్డంగా కూర్చున్నారు. దీంతో ఆమె ఆరు గంటలకుపైగా కారులోనే చిక్కుపోయారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను నిర్మ ల్ ఆసుపత్రికి తరలించారు.ఉ.10 గంటల నుండి ధర్నాలో కూర్చున్న రైతులు, ప్రజలు కలెక్టర్ వచ్చి ఫ్యాక్టరీ రద్దు చేస్తామని హామీ ఇచ్చేవరకు రోడ్డుపైనే కూర్చుంటామని, రోడ్డుపైనే వంట వరకు చేసుకొని సహఫంక్తి భోజనాలు చేశారు.దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక జెఎసి ఇచ్చిన బంద్‌కు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మ ద్దతు తె లిపారు. వ్యాపార సముదాయాలను బంద్ చేసి రై తులు, ప్రజలు, వ్యాపారులు, మహిళలు, వ్యవసాయ పనులను నిలిపివేసి ఉదయం నుండి రా త్రి వరకు రోడ్డుపైనే ధర్నాలో కూర్చున్నారు. రా త్రి చలి తీవ్రత ఎక్కువ కావడంతో రోడ్డుపైనే చలి మంటలు వేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News