Thursday, December 26, 2024

కజఖస్తాన్‌లో పెట్రోల్ ధరల పెంపుపై ప్రజా ఆందోళన..

- Advertisement -
- Advertisement -

కజకిస్థాన్‌లో ఆందోళనలు హింసాత్మకం
డజన్ల కొద్దీ నిరసనకారులు మృతి, 12మంది పోలీసులు మృత్యువాత

మాస్కో: కజకిస్తాన్‌లోని అతి పెద్ద నగరం అల్మాటిలో బుధవారం రాత్రి పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలపై దాడులు చేయడంతో వారిని అదుపుచేయడానికి పోలీసులు జరిపిన కాల్పులలో డజన్ల కొద్దీ నిరసనకారులు మరణించారు. 12మంది పోలీసులు కూడా దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి వందలాది మంది మంది ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారని, డజన్ల కొద్దీ ఆందోళనకారులు పోలీసుల కాల్పులలో మరణించారని పోలీసు మహిళా ప్రతినిధి సుల్తానత్ అజీర్‌బెక్ గురువారం తెలిపారు. బుధవారం నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి మేయర్ భవనంతో సహా అనేక ప్రభుత్వ భవనాలపై దాడులు నిర్వహించినట్లు ఆమె చెప్పారు. మేయర్ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మూడు దశాబ్దాల క్రితం స్వాతంత్య్రం పొందిన కజఖస్తాన్ మొట్టమొదటిసారి భారీ స్థాయిలో పౌర నిరసనలను చవిచూస్తోంది. ఆందోళనకారులు అనేక ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలలో 8 మంది పోలీసులు కూడా మరణించారు. పెట్రోల్ ధరల భారీ పెరుగుదలపై దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో ప్రారంభమైన నిరసనలు క్రమంగా అల్మాటీతోపాటు దేశ రాజధాని నూర్ సుల్తాన్‌కు పాకాయి.

Protest against Fuel price hike in Kazakhstan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News