- Advertisement -
మనతెలంగాణ/దుమ్ముగూడెం: పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు సరియం రాజమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దబండిరేవు గ్రామంలో ఐద్వా సంఘం ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా ఖాళీ గ్యాస్ బండలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ సామాన్య ప్రజానీకం నడ్డివిరిచేలా నిత్యవసరాలను ఆమాంతం పెంచేస్తుందన్నారు. దీపావళి పండుగకు కానుకగా గ్యాస్ ధరలను పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వంకే చెందుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు అయ్యే పనులను నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షులు సోయం సుశీల, సమ్మక్క, సోయం పార్వతి, పూనెం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -