Monday, December 23, 2024

ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ వద్ద నేడు నల్లబెలూన్స్ ఎగురవేసి నిరసన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నేడు శనివారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ నందు నల్ల బెలూన్స్ (నల్ల బుగ్గలు) ఎగరవేసి నిరసన తెలియజేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును ఏపి ఏసిబి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అయితే ఈ కేసుకు సంబంధించి ఏసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కష్టడీకి ఇవ్వాలని సిఐడి వాదిస్తుంటే.. అసలు ఆధారాలు లేవని ఈ కేసును కొట్టేయాలని చంద్రబాబు తరఫున వాదనలు కొనసాగుతున్నాయి. ఇలా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంచారని, విచారణ పేరుతో మరో రెండు రోజులు జైలుకే పరిమితం చేయడం విచారకరమని వారు తెలిపారు. ఈ క్రమంలో నేడు తలపెట్టిన నల్లబెలూన్స్ ఎగరవేసి నిరసన తెలియజేస్తున్నామని, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు తమ సంఘీభావం తెలిజయేయాలని టి టిడిపి విజ్ఞప్తి చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News