పూల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనికుల వితంతువులు కుటుంబాలకు ఉద్యోగాలు, ఇతర సమస్యలపై డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు.
జైపూర్: రాజస్థాన్ పోలీసులు బిజెపి నాయకుడు కిరోడి లాల్ మీనాను అదుపులోకి తీసుకున్న ఒక్క రోజు తర్వాత, పార్టీ కార్యకర్తలు ఈ రోజు జైపూర్‌లో మరో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనికుల వితంతువుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఇతర సమస్యలపై రెండు రోజులుగా నిరసన కొనసాగుతోంది.
వితంతువులను రాజకీయ ప్రయోజనాల కోసం మీనా ఉపయోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి అశోక ఆరోపించారు. కాగా మీనా ‘పోలీసులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఆరోపించారు. నేడు నిరసనకారులు అశోక్ గెహ్లాట్ ఇంటివైపు నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా అదికాస్తా హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు విసరడమేకాకుండా, వారి బారికేడ్లను కూడా ఛేదించారు. తర్వాత పోలీసులు లాఠీ చార్జీ చేపట్టారు.
#WATCH | Huge protest rally held by BJP workers in Rajasthan's Jaipur over the matter of protest by widows of the jawans who lost their lives in the 2019 Pulwama terror attack. pic.twitter.com/myYrYM4jA7
— ANI (@ANI) March 11, 2023