Monday, December 23, 2024

మణిపూర్ ఆదివాసీలకు మద్దతుగా 3న ఢిల్లీలో నిరసన : టిపిసిసి ఎస్‌టి సెల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో ఆదివాసీల పై దాడులను కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని టిపిసిసి ఎస్‌టి సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ ఆరోపించారు. ఆదివాసీలకు మద్దతు గా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధం అవుతోందని ఆయనన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బల్లయ్య నాయక్ మాట్లాడారు. మణిపూర్ ఆదివాసీలకు అండగా ఈ నెల 3 న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. మణిపూర్ ఘనట తర్వాత దేశంలో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆగస్ట్ 9న ఆదివాసీ దినోత్సవం సంధర్భంగా ఆదివాసీలకు ధైర్యం ఇచ్చేందుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టబోతోందని తెలిపారు. ఆగస్ట్ 6న ఆదివాసీ తండాల్లో బస చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. 7న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 8 న సాయంత్రం కాగడాల ప్రదర్శన, 9న ఆదివాసీ కవాతు ,ఆదివాసీ మహాసభ నిర్వహిస్తామని బెల్లయ్య నాయక్ తెలిపారు. వచ్చే నెలలో భారీ బహిరంగ సభ పెట్టి ఎస్‌టి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News