స్తంభం ఎక్కి నిరసన తెలిపిన యువతి
ప్రధాని కోరినా ససేమిరా
ప్రధాని మోడీ సభలో నిరసన తెలిపిన యువతి
‘మాదిగల విశ్వరూపం’ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో వర్గీకరణ చేయవద్దంటూ విద్యుత్ స్తంభం ఎక్కి ఓ యువతి నిరసన తెలిపింది. మోడీ పాలన చేపట్టిన తరువాత కులాల పేరుతో రెచ్చగొడుతున్నారని, రోజుకో హత్యాచారం జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఒకే మతాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ యువతి ఆగ్ర హం వ్యక్తం చేసింది.
యువతి పోల్ ఎక్కడం చూసిన మోడీ వెంటనే ప్రసంగం నిలిపి వేసి కరెంటు పోల్ దిగాలని యువతిని సూచించారు. తాను మీ కోసమే వచ్చానని, నీ బాధను కచ్చితంగా వింటానని యువతికి చెప్పారు. కరెంట్ పోల్ ఎక్కడంతో షాక్ వస్తుందని, దిగాలని కోరారు. అయినా యువతి ససేమిరా అనడంతో పోలీసులు బలవంతంగా యువతిని కిందికి దింపారు. యువతి నిరసన తెలపడం సభలో చర్చనీయాంశంగా మారింది.