Monday, January 20, 2025

మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణలకు వ్యతిరేకంగా మార్చి 23న నిరసన

- Advertisement -
- Advertisement -

 నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి : వామపక్ష పార్టీల పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం మార్చి 22న సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్‌లో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్దన్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. దీన్ని వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసన కార్యక్రమం వుంటుంది. పార్లమెం ట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజాతంత్ర హక్కులను కాల రాస్తున్నది. స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలైన ఇడి, ఐటి, సిబిఐలను తమ జేబు సంస్థలుగా వాడుకుంటున్నది.

బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బిజెపియేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. దీనిలో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితలను అరెస్టు చేసింది. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నది. ఈ నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలని, శని వారం జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్య, డిజి నరసింహారావు, సిపిఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేష్, సిపిఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్దన్, ఎంసిపిఐ (యు) నాయకులు వనం సుధాకర్, ఎన్‌యుసిఐ (యు) నాయకులు తేజ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News