Monday, December 23, 2024

‘బాయ్స్ హాస్టల్’ నుంచి ప్రొటెస్ట్ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, కంటెంట్ బేస్డ్ చిత్రాలని రూపొందించే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో కలిసి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ ని ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు తీసుకొస్తుంది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్  నటించిన ఈ చిత్రంలో  రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి అతిథి పాత్రల్లో కనిపించారు. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్ B. P. , అరవింద్ S. కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్ , వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు.

ఈ చిత్రం గత నెలలో కన్నడలో విడుదలై యునానిమస్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే 20+ కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ కలిసి ఈ చిత్రాన్ని ‘బాయ్స్ హాస్టల్’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ప్రొటెస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. హాస్టల్ బాయ్స్ కష్టాలని ఎంటర్టైనింగ్  గా ప్రజెంట్ చేసిన ఈ పాటని అజనీష్ లోక్‌నాథ్ క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. సాయి చరణ్ పాడిన ఈ పాటకు భాస్కర భట్ల అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా సురేష్ ఎమ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘బాయ్స్ హాస్టల్’ ఆగస్ట్ 26న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News