Wednesday, January 22, 2025

జుక్కల్‌లో నిరసన దీక్ష

- Advertisement -
- Advertisement -

పిట్లం (బాన్సువాడ): జుక్కల్ మండల కేంద్రంలో గురువారం బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రైతుల పట్ల, ఉచిత విద్యుత్ పైన రైతు వ్యతిరేక వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలుపుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యావత్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ సీఎం కేసిఆర్ అందరికి అండగా నిలుస్తున్నారని, ముఖ్యంగా రైతాంగంకు 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటివి అందజేస్తుంటే కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదన్నారు. లేని పోని అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, 3 గంటల కరెంట్ మాట సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News