Thursday, January 23, 2025

అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: మండల పరిధిలోని కాచవాని సింగారం గ్రామంలో కోటి 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాని కి వచ్చిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని స్థా నిక మహిళలు, యువకులు, కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు వివిధ కారణాలతో సోమవారం అడ్డుకున్నారు.

కాచవాని సింగారం గ్రామంలోని అం బేద్కర్ విగ్రహం వద్ద సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్‌లతో కలసి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం శంకుస్థాపన వద్దకు వెళ్లిన మంత్రిని స్థానిక మహిళలు, వైఎస్ ఎంపిపి కర్రె జంగమ్మ, ఉపసర్పంచ్ చెట్టిపల్లి గీత, వార్డు సభ్యులు మంత్రిని నిలదీశారు.

గతంలో ఇక్కడ ఉన్న గదిని, గద్దెను కూల్చివేతలను అడ్డుకున్నప్పటికి, సర్పంచ్ తిరిగి కొత్తది నిర్మించి ఇస్తామని చెప్పడంతో నాడు వెనుకకు తగ్గామని, ఇప్పుడు విగ్రహం చుట్టు సిసి రోడ్డులు పనులకు శంకుస్థాపన చేయడం ఏమిటని స్థానికులు, యువకులు వార్డు, సభ్యులు ప్రశ్నించారు. పార్టీలకు సంబంధం లేదని, గ్రా మస్తులందరికీ అవసరమైన దానిని కూల్చి వేశారని, ఇప్పుడు సిసి రోడ్డు వేస్తామని వస్తున్నారని, ఈ పనులు ఏవిధంగా చేస్తారో చూస్తామని హెచ్చరించారు. మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

దీనితో తోపులాటలు జరిగాయి. అక్కడ ఉన్న మహిళలను, యువకులను పోలీసులు పక్కకు జరపడంతో మంత్రి కొ టబ్బరికాయ కొట్టి ముత్వెల్లిగూడలోని పలు శంకుస్థాపన కార్యక్రామానికి వెళ్ళారు. అనంతరం పోలీసులు మంత్రి ముందు సమస్యలు ప్రస్థావించిన, నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బిజేపి నాయకులు బస్తరాజ్ గౌడ్, ప్రభంజన్ గౌడ్‌లను పోలీసులు వ్యానులో పోలీసుస్టేషన్‌కు తరలించారు.

బిఆర్‌ఎస్, బిజేపి ఒక్కటే కదా ?

కాచవాని సింగారం గ్రామం రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద సిసి రోడ్డు పనుల ప్రారంభం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ఘట్‌కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శ న్‌రె డ్డిని పట్టుకొని అభివృద్ధికి కలసి పోదామని, విజయం సూచికగా బొటనవేలు లేపడంతో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటే కదా అని అనడంతో అందరు ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ అంశం అక్కడ చర్చనీంశయంగా మారింది.

అంతే కాకుండా మహేశ్వరి కాలనీలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదులు ప్రారంభం సందర్భంగా సహితం ఎంపిపిని ప్రక్కన కూర్చోబెట్టుకొని నేను లక్ష్మణ్‌తో మాట్లాడతాను… నాకు సన్నిహితుడు నీ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెబుతాననిని, లేదంటే తనకు మద్దతు తెలపాలని అనడం, నిజంగా బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనా అనే అనుమానాలు స్థానికుల నుం డి వ్యక్తమయ్యాయి. మంత్రి ఎప్పుడు లేని విధంగా ఎంపిపిని దగ్గరకు తీసుకోవడం పైవిధంగా మాట్లాడడం, అందులో జిల్లా పరిషత్ చైర్మన్ బిఆర్‌ఎస్, బిజేపి ఒక్కటేనా అనడంతో అసలు రాజకీయాలలో ఏమి జరుగుతుందనే ఆలోచనలు రేకేత్తించాయి.

అయితే జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, తన తండ్రి మా జీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిలు పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు వ్య క్తమవుతున్నాయి. అందుకే ఈ నెల 16 తమ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంలో రాజకీయాలలో మార్పు లు సంభవించనున్నాయంటే అవుననే సమాధానాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News