Monday, December 23, 2024

బస్సు సౌకర్యం కల్పించాలని చెవిలో పూలతో నిరసన

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రం నుండి గూడూరుకు, తొర్రూరుకు ఆర్టీసి బస్సులు నడపాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఎంసిపిఐ(యూ) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాటోతు బిచ్చానాయక్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో చెవిలో పూలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కేసముద్రం మండల కేంద్రం నుండి ఆయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రైవేటు వాహనాల కోసమేనా అని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని లేకుంటే దశలవారీ పోరాటాలకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. బానోత్ సాయితేజ్, పానుగంటి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News