Wednesday, January 22, 2025

పిఒకెలో పాక్ భద్రత దళాలను తరిమి తరిమి కొట్టిన నిరసనకారులు

- Advertisement -
- Advertisement -

పిఒకెలో విధ్వంసం
పన్ను రహిత విద్యుత్, గోధుమ పిండిపై సబ్సిడీ కోసం సమ్మెకు జెఎఎసి పిలుపు
హింసాత్మకంగా మారిన నిరసన ప్రదర్శనలు
ఒక పోలీస్ అధికారి మృతి
ఘర్షణల్లో 100 మందికి పైగా గాయాలు
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులు, భద్రత దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. హింసాత్మకంగా మారిన ఘర్షణల్లో ఒక పోలీస్ అధికారి మరణించగా, పోలీస్ సిబ్బందితో సహా 100 మందికి పైగా గాయపడ్డారు. ఆందోళనకారుల చేతుల్లో చిక్కుకున్న పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పిఒకెలోని దద్యాల్, మీర్పూర్, సమహానీ, సెహన్సా, రావల్‌కోట్, ఖుయిరట్టా, టప్పాపానీ, హట్టియన్ బాలా సహా ఇతర ప్రాంతాల్లో ఆందోళనకారులు, భద్రత అధికారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

మంగ్లా డ్యామ్ నుంచి పన్ను రహిత విద్యుత్, గోధుమ పిండిపై సబ్సిడీలు ఇవ్వాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ (జెఎఎసి) షట్టర్ డౌన్, వీల్ జామ్ సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళనలు ప్రజ్వరిల్లాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వారు గాలిలోకి తుపాకులు పేల్చారు. పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. పలువురు ఆందోళనకారులు భద్రత సిబ్బందిని పట్టుకుని కర్రలతో చితకబాదారు. దీనితో వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు, భద్రత సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనితో అల్లర్లను నియంత్రించేందుకు పాకిస్తాన్ రేంజర్స్, ఫ్రాంటియర్ కోర్ నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నారు.

మీర్పూర్ సీనియర్ ఎస్‌పి కమ్రరాన్ అలీ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఇస్లామ్‌గఢ్ పట్టణంలో భద్రత విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ అద్నాన్ ఖురేషి ఛాతీలో తగిలిన తూటా గాయానికి మరణించినట్లు తెలియజేశారు. జెఎఎసి బ్యానర్ కిండ్ కోట్లీ, పూంఛ్ జిల్లాల మీదుగా ముజఫరాబాద్‌కు సాగుతున్న ర్యాలీని ఆపేందుకు ఇతర పోలీస్ సిబ్బందితో పాటు ఖురేషిని నియమించినట్లు ఆయన తెలిపారు. ముజఫరాబాద్, మీర్పూర్ డివిజన్లలో బుధ, గురువారాల్లో పోలీసులు జరిపిన దాడులలో సుమారు 70 మంది జెఎఎసి కార్యకర్తలను అరెస్టు చేశారు. దానితో గురువారం దద్యాల్‌లో తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News