Monday, December 23, 2024

Yediyurappa: యడ్యూరప్ప నివాసంపై రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం రిజర్వేషన్ల తెనెతెట్లెను కదిలించింది. కోటాలో భారీ స్థాయి మార్పులను నిరసిస్తూ శివమొగ్గలో సోమవారం బిజెపి ప్రముఖుడు, మాజీ సిఎం బిఎస్ యడ్యూరప్ప నివాసం వద్ద భారీ ప్రదర్శన జరిగింది. యడ్యూరప్ప ఇంటిపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. దీనితో ఇక్కడ ఉద్రిక్తత చెలరేగింది. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవలే కోటాలో మార్పులు చేపట్టింది. ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై ప్రభుత్వం కోటాలో పంపకాలకు దిగింది. ముస్లింలకు ఉన్న ప్రత్యేక కోటాను రద్దు చేసింది. ఇక రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు (ఎస్‌సి) ఇప్పుడు పొందుతున్న 17 శాతం కోటాలో ఉపవర్గీకరణలకు దిగింది. ఇందులో ఎస్‌సి (లెఫ్ట్)కు 6 శాతం, ఎస్‌సి (రైట్) కు 5.5 శాతం, ఇక 4.5 శాతం అంటరానివాళ్లు కాని వాళ్లకు, మరో ఒక్కశాతం ఇతరులకు కోటాను నిర్ణయించి కేంద్రానికి పంపించింది.

ఎజె సదాశివన్ కమిషన్ నివేదిక మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ వర్గీకరణను ఇప్పటి ప్రభుత్వం ఈ మేరకు కోటాల కేటాయింపులు చేయడాన్ని బంజారాలు , భోవి వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ , యడియూరప్ప నివాసాన్ని లక్షంగా ఎంచుకుని దాడికి యత్నించాయి. పెద్ద ఎత్తున ఇంటికి పైకి రాళ్లు రువ్వారు. దీనితో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. కేంద్రానికి పంపించిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనకకు తీసుకోవాలని బంజారా వర్గాలు హెచ్చరించాయి. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి కలిపితే రాష్ట్ర జనాభాలో 24 శాతం వరకూ ఉంటారు. రాష్ట్రంలో బంజారాలు షెడ్యూల్ తెగల జాబితాలో ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల కోటాలో మార్పులపై ముస్లింలు మండిపడుతున్నారు. ఒబిసిల 2 బి కేటగిరి నుంచి తమను తప్పించడం ద్వారా తమకు దక్కే 4 శాతం కోటాకు గండికొట్టినట్లు అవుతోందని ముస్లిం పేదలు నిరసనకు సిద్ధం అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News