Thursday, November 14, 2024

జూనియర్ డాక్టర్ల ఆరోగ్య స్థితి క్షీణిస్తోంది

- Advertisement -
- Advertisement -

నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న నిరసనకారులైన జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థిత క్షీణిస్తుండడం పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఆందోళన వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాసింది. ఆమె వెంటనే జోక్యం చేసుకోవాలని ఐఎంఎ విజ్ఞప్తి చేసింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లు అన్నిటినీ తీర్చే సామర్థం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఉందని ఐఎంఎ అధ్యక్షుడు డాక్డర్ ఆర్‌వి అశోకన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘బెంగాల్ యువ వైద్యులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి దాదాపు వారం అవుతోంది. వారి న్యాయమైన డిమాండ్లను ఐఎంఎ సమర్థిస్తోంది. మీ తక్షణ జోక్యానికి వారు అర్హులు. అన్ని డిమాండ్లను తీర్చే సత్తా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఉంది’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఐఎంఎ గురువారం రాసిన ఆ లేఖను శుక్రవారం బహిర్గతం చేసింది. ‘ప్రశాంత వాతావరణం, భద్రత విలాస వస్తువులేమీ కాదు. అవి ముందు అవసరం. ఒక పెద్దగా. ప్రభుత్వాధినేతలగా మీరు యువ తరం డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలోని మొత్తం వైద్యులు ఆందోళన చెందుతున్నారు, వారి ప్రాణాలను మీరు కాపాడగలుగుతారని విశ్వసిస్తున్నారు. ఐఎంఎ పలుకుబడి అవసరమనిపిస్తే సంతోషంగా సాయం చేస్తాం’ అని ఆనందన్ తన లేఖలో తెలిపారు. ఆ లేఖకు సమాధానం వచ్చిందా అన్న ప్రశ్నకు ‘అందు కోసం నిరీక్షిస్తున్నాం’ అని ఆనందన్ సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News