Thursday, January 23, 2025

కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ, ఫ్లకార్డులతో ఎమ్మెల్యే నిరసన

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మూడు గంటల విద్యుత్ చాలన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ విధానంపై మంగళవారంమిర్యాలగూడ మండలంలోని తుంగపాడు, ఉట్లపల్లి రైతువేదికల వద్ద ప్లకార్డులతో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నిరసన తెలిపారు. గ్రామ రైతు వేదిక ల్లో మూడు పంటలు బిఆర్‌ఎస్ నినాదం – మూడు గం టల కరెంటు కాంగ్రెస్ నినాదం అంటూ నిరసన నిర్వహించారు. రైతు సమావేశాన్ని నిర్వహించి, తీర్మాణా లు చేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు, రాష్ట్ర ఆ్ర గోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, రైతులకు రైతుబంధు, రైతుభీమా పథకాలను అందిస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని చూసి, కాంగ్రెస్ వారు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. రైతును రాజు చేయటమే ప్రభుత్వ లక్షమని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, వైస్ ఎంపిపి అమరావతి సైదులు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు పేలపోలు తిరుపతమ్మ, చౌగోని భిక్షం గౌడ్, మండల రైతు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు,  బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News