బంగారం గొలుసు చోరీ చేశాడని నిమ్స్ కార్మికుడిని పంజాగుట్ట పోలీసులు చితకబాదడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. నిమ్స్ ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ వద్ద పనిచేస్తున్న లింగయ్య అనే కార్మికుడు గురువారం 4.30 గంటలకు ఓపి పేషంట్‌కు ఎంఆర్‌ఐ ఉంది, అతి వద్ద అటెండెంట్లు ఎవరూ లేకపోవడంతో లింగయ్య పేషంట్ వద్ద ఉన్న వస్తువులు తీసుకుని స్కానింగ్ వద్ద ఉన్న వ్యక్తికి హ్యాండవర్ చేశారు. స్కానింగ్ పూర్తైన తర్వాత లింగయ్య పేషంట్‌కు తన వద్ద ఉన్న వస్తువులు ఇచ్చాడు. అందులో తన బంగారు గోలుసు లేదని చోరీ చేశావని అనడంతో తనకు తెలియదని, మొబైల్ ఫోన్ ఇచ్చావని దానిని తిరిగి ఇచ్చానని చెప్పాడు.
అయినా వినకుండా పేషంట్ సెక్యూరిటీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశాడు. సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్న రామారావు విషయాన్ని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు లింగయ్యను తీసుకుని వెళ్లి చితకబాదారు. తర్వాత గోల్డ్ చైన్ పేషంట్ వద్ద ఉన్నట్లు తెలియడంతో ఒక్కసారిగా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. అకారణంగా కార్మికుడిపై దాడి చేసిన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులతో సమావేశమై న్యాయం చేస్తామని నిమ్స్ డైరెక్టర్ చేప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు.