Sunday, January 19, 2025

ఓయూలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ కళాశాల ఎదుట చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. గురువారం ఫ్యాస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘న్యాయాన్ని నిర్బంధించ లేరు’ పేరుతో విన్నూత్న రీతిలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏపి రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులు అలుముకున్నాయని, పూర్తి మెజారిటీ ఇచ్చి మెరుగైన పాలన అందించాలని ప్రజలు కోరితే… హత్యారాజకీయాలు, అక్రమంగా కేసులు పెట్టడం కోసం కాదన్నారు. చంద్రబాబు నూతన హైదరాబాద్ నగరానికి పునాదులు వేసి, హైదరాబాద్ కేంద్రంగా ఐటి విప్లవానికి శ్రీకారం చుట్టి ఉపాధి కల్పన కోసం బాటలు వేసిన బాటసారి అని గుర్తు చేశారు. ఆయన దూర దృష్టితోనే హైదరాబాద్ ఆర్ధిక, ఉపాధి రాజధానిగా విలసిల్లుతోందన్నారు. ఇక్కడ పెట్టుబడుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాలకులను ఒప్పించి, మెప్పించిన పరిపాలనాదక్షుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు రీత్యా రాష్ట్రపతి ఆయనను విడుదల చేసేందుకు చొరవ చూపాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News