Sunday, December 22, 2024

తమిళనాడు గవర్నర్‌కు నీట్ నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

Protests against Tamil Nadu Governor RN Ravi

మయిలాడుతురై(తమిళనాడు): ఇక్కడి ఒక ప్రముఖ ధార్మిక మఠాన్ని మంగళవారం సందర్శించిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో స్వాగతం పలికారు. కాగా..ధర్మపురం ఆధీనం మఠాన్ని సందర్శించిన గవర్నర్‌కు స్థానిక బిజెపి నాయకులు మాత్రం త్రివర్ణ పతాకంతో స్వాగతం పలకడం గమనార్హం. నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుతోసహా వివిధ బిల్లులను గవర్నర్ రవి ఆమోదించకుండా తొక్కిపెట్టారని ఆరోపిస్తూ విడుదలై చిరుతైగల్ కట్చి(విసికె)తో సహా వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అంతకుముందు గవర్నర్ కాన్వాయ్ వెళుతున్న మార్గంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన కాన్వాయ్‌పై నల్లజెండాలను విసరడానికి వారు ప్రయత్నించడంతో పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా..ఈ సంఘటనలపై ప్రతిపక్ష ఎఐఎడిఎంకె, బిజెపి ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News