- Advertisement -
హిమాచల్ ప్రదేశ్ మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలని కోరుతున్న నిరసనకారులపై పోలీసులు శుక్రవారం నీటి కేనన్‌లు ప్రయోగించారు. నిరసనకారులు ఆదిలో మండి మార్కెట్ ప్రాంతంలో పాదయాత్ర జరిపి, సెరి మంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తరువాత వారు మసీదు దిశగా సాగే యత్నం చేసినప్పుడు పోలీసులు వారిని నిలువరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నీటి కేనన్‌లు ప్రయోగించారు.
హిందు సంస్థలు నిరసన యాత్రలకు పిలుపు ఇచ్చిన తరువాత మండిలో పోలీసులు భద్రత ఏర్పాట్లు పెంచి, భారీగా బలగాలను మోహరించారు. గురువారం ముస్లిం సమాజం సభ్యులు పట్టణంలోని జైలు రోడ్డులోగల మసీదులో అనధికార భాగాన్ని స్వయంగా కూల్చివేశారు. పబ్లిక్ వర్క్ శాఖకు చెందిన స్థలంలో మసీదు ఉన్నది. దీనిపై మసీదు యాజమాన్యానికి పిడబ్లుడి, మునిసిపల్ కార్పొరేషన్ రెండూ నోటీసులు జారీ చేశాయి.
- Advertisement -