Monday, January 20, 2025

ఆదిపురుష్‌పై యుపిలో నిరసనలు: లక్నోలో హిందూ మహాసభ పోలీసు కేసు

- Advertisement -
- Advertisement -

వారణాసి: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంపై వారణాసితోసహా ఉత్తర్ ప్రదేశ్‌లో అనేక చోట్ల సోమవారం నిరసనలు మిన్నంటాయి. ఆదిపురుష్ చిత్రం పోస్టర్లను హిందూ సంస్థల కార్యకర్తలు చింపివేశారు. లక్నోలో ఆదిపురుష్ చిత్రనిర్మాత, దర్పైశకుల హిందూ మహాసభ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

నిరసనకారులతో సమాజ్‌వాది పార్టీ కూడా గొంతు కలిపింది. ఆదిపురుష్ చిత్రంలోని చౌకబారు డైలాగులతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సమాజ్‌వాది పార్టీ తెలిపింది. ఇదంతా ఒక అజెండాలో భాగంగానే జరిగిందని ఆ పార్టీ పేర్కొంది.
రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఓం రౌత్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలోని సంభాషణలు, ఆ చిత్రంలో పాత్రలపై దేశంలోని పలు ప్రాంతాలలో వివాదం రాజకుంది.

వారణాసిలో హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు చిత్ర పోస్టర్లను చింపివేయడంతో చిత్రాన్ని చూడవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక ఆలయం వద్ద గుమికూడిన హిందూ కార్యకర్తలు సిగ్రా ప్రాంతంలోని ఒక మాల్‌కు ఊరేగింపుగా వెళ్లి ఆదిపురుష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మాల్‌లోకి చొరబడేందుకు వారు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

రాష్ట్ర రాజధాని లక్నోలో ఆదిపురుష్ చిత్రంపై హిందూ మహాసభ కార్యవర్గ సభ్యులు హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిత్ర నిర్మాతలు, దర్శకుడిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. హిందూ మహాసభ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తమ రాజకీయ గురువుల డబ్బుతో ఒక అజెండాతో ఇటువంటి చిత్రాన్ని తీసిన వారి రాజకీయ వ్యక్తిగత చరిత్రను సెన్సార్ బోర్డు చూడాల్సి ఉంటుందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న ఇటువంటి చిత్రాల పట్ల సెన్సార్ బోర్డు దృతరాష్ట్ర పాత్ర పోషిస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News