Monday, December 23, 2024

పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయులకు జాక్టో పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టనున్న ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) ప్రకటించింది. సోమవారం కాచిగూడలోని యస్.టి.యు. కార్యాలయంలో జరిగిన జాక్టో సమావేశంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినం పురస్కరించుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై బోజన విరామ సమయంలో నిరసస, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందిస్తామని జాక్టో చైర్మన్ జి.సదానందం గౌడ్ అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, పిఆర్‌సి కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలని, కోర్టు కోసుల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాక్టో చైర్మన్ జి.సదానందం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాక్టో ట్రెజరర్, బిసిటిఎ రాష్ట్ర అధ్యక్షుడు కె. కృష్ణుడు, నాయకులు మట్టపల్లి రాధాకృష్ణ, దానయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News