ముజఫరాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వ వివక్షాపూరిత రాజకీయాల పట్ల విరక్తి చెందిన పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె)లోని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజలు భారత్‌లో పునర్ విలీనాన్ని కోరుతూ మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గిల్గిట్ బల్టిస్తాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన నిరసనకారులు కార్గిల్ రోడ్డును తిరిగి ప్రారంభించాలని, భారత్‌లోని కేంద్ర పాలిత లడఖ్‌కు చెందిన కార్గిల్ జిల్లాలో తమను విలీనం చేయాలని వారు డిమాండు చేశారు.
ఐదు దశాబ్దాలపాటు తమ ప్రాంతాన్ని దోచుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం గిల్గిట్ బల్టిస్తాన్‌కు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హిమాలయ ప్రాంతంలో భద్రతా దళాలు భూ కదురాక్రమణను ఆపాలని పిఓకె మాజీ ప్రధాని రజా ఫరూఖ్ హైదర్ పాక్ ప్రభుత్వాన్ని అర్థించారు.
Gilgit Baltistan protests against their oppressors.pic.twitter.com/EpzieUPpzN
— مہروز (@DazzlinMehroz) January 9, 2023
#Gilgit_Baltistan solidarity rally in #Muzaffarabad today. #Kashmir #JammuKashmirPeoplesLivesMatter. #JKPLM pic.twitter.com/rfCh5qnh7y
— Mirza (@Mirza45994191) January 10, 2023