Monday, December 23, 2024

ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ముస్లిం దేశాల్లో భారీ ప్రదర్శనలు

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: హమాస్‌కు మద్దతుగా, గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం మధ్యప్రాచ్యంలోని పలు ముస్లిం దేశాల్లో వేలది మంది ముస్లింలు శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ మొదలుకొని యెమన్ రాజధాని సనా దాకాపలు నగరాల్లో వేల సంఖ్యలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనల తర్వాత వీధుల్లోకి వచ్చి గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులపై తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. జెరూసలెంలోని అల్ అక్సా మసీదులో పోలీసులు వృద్ధులు, పిల్లలు, మహిళలను మాత్రమే మసీదులోకి ప్రార్థనలకు అనుమతించారు. దీంతో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో మసీదు వద్దకు చేరుకున్న యువకులు లయన్ గేట్ సమీపంలోని మెట్ల వద్దకు చేరుకుని అక్కడే ప్రార్థనలు చేయడానికి ఉపక్రమించారు. అయితే పోలీసులు వారిని తరిమి కొట్టారు.

బీరూట్‌లో వేలాది మంది హిజ్బుల్లా మద్దతుదారులు లెబనాన్, పాలస్తీనా, హిజ్బుల్లా జెండాలను ఊపుతూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో షియా మత గురువు, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుడు ముక్తదా అల్ సదర్ పిలుపు మేరకు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక ఇజ్రాయెల్ బద్ధ శత్రువైన ఇరాన్ దేశవ్యాప్తంగా హమాస్‌కు మద్దతుగా భారీ ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులు అమెరికా, ఇజ్రాయెల్ జాతీయ పతాకాలను దగ్ధం చేశారు. ఇక యెమన్ రాజధాని సనాలో కూడా జనాలు పెద్ద సంఖ్యలో యెమన్, పాలస్తీనా జెండాలతో వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోకూడా ప్రార్థనల అనంతరం కొంత మంది అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను తొక్కుతూ తమ నిరసనను తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News