Monday, January 20, 2025

ప్రొటోకాల్ వివాదం.. ఆనాడు ఎన్‌టిఆర్‌ను ఆహ్వానించిన ఇందిర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ను ప్రోటోకాల్ ప్రకారం కలుసుకోకుండా చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆక్షేపణలు తెలియజేశారు. ఈ సందర్భంగా 1983 నాటి సంఘటనను గుర్తు చేశారు. ఆనాడు శ్రీహరికోట కేంద్రంలో ఎస్‌ఎల్‌వి 3 డి2 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆనాటి ఎపి సిఎం ఎన్టీఆర్‌ను ఆహ్వానించారని వివరించారు. శనివారం ప్రధాని మోడీ గ్రీస్ దేశం నుంచి నేరుగా ఇస్రో శాస్త్రవేత్తల వద్దకు వచ్చి అభినందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ను తనకు స్వాగతం పలకడానికి రావద్దని చెప్పడం చర్చనీయాంశం అయింది. దీనికి మోడీ వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే అని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News