Thursday, January 23, 2025

రాకెట్ల రాజధాని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. దీంతో స్పేస్‌టెక్ కు క్యాపిటల్‌గా త్వరలో హైదరాబాద్ మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్పేస్‌టెక్ పాలసీతో నగరంలోనే రాకెట్లు త యారు చేయడమే కాకుండా… ఇక్కడి నుం చే ప్రయోగించవచ్చనని అన్నారు. అంతరిక్షంలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించి చరిత్ర సృష్టించిన స్పైస్‌టెక్ కంపెనీ యజమాన్యానికి ఈ సందర్భంగా కెటిఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అభినందన సభ శుక్రవారం నాడిక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్ మాట్లాడుతూ, రాకెట్ల తయారీ అంటేనే ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపించరన్నారు. అయితే ప్రభు త్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పాలసీతో స్పేస్‌టెక్ రంగం మరింతగా అభివృద్ధి చెందనుందన్నారు. పారిశ్రామిక వేత్తల్లో కూడా త్వరలోనే ఈ మార్పును చూడబోతున్నామన్నారు. పెద్దఎత్తున ఈ రంగంలోనూ పెట్టుబడులు సాధించబోతున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ విజయం సాధించినట్లుగానే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో స్టార్టప్ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేయబోతుందన్నారు. త్వరలో మరో సక్సెస్ స్టోరీని దేశం చూడబోతుందన్నారు.

స్కైరూట్ లాంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడం గర్వకారణం

స్కైరూట్ లాంటి కంపెనీలకు మొదటి నుంచి మద్దతివ్వడం తమకు గర్వకారణంగా ఉందని కెటిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని….. ఇందకు సహకరించాలని కెటిఆర్‌ను స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ కోరింది. దీనిపై స్పందించి కెటిఆర్ మాట్లాడుతూ… స్కైరూట్ ప్రతిపాదిస్తున్న సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రానికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిందిస్తుందన్నారు.

స్కైరూట్‌సక్సెస్‌తో హైదరాబాద్ టి… హబ్ పేరు మరోసారి మారుమోగిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇందుకు స్కైరూట్ కంపెనీకి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్షరంగంలో చరిత్ర సృష్టించిన స్కై రూట్ కు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. దేశ అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మక సందర్భం అన్నారు. రాకెట్ లాంటి సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం సులభం కాదన్న కెటిఆర్…. తొలి ప్రయత్నంలో అంతరిక్షంలోకి రాకెట్ ను పంపగలిగే సత్తా సంపాదించడం గర్వంగా ఉందన్నారు. స్కై రూట్ కంపెనీ టీంవర్క్‌తోనే ఇది సాధ్యమైందన్నారు.

అద్భుతమైన ఆలోచనలకు ఊతం ఇచ్చేలా

తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆలోచనలకు ఊతం ఇచ్చేలా టి.హబ్, టి.వర్క్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని స్కై రూట్ ఏరో స్పేస్ కంపెనీ యాజమాన్యం తెలిపింది. తమ ప్రస్థానంలో ఈ రెండింటి పాత్ర మరువలేనిదని వ్యాఖ్యానించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కెటిఆర్‌కు స్కై రూట్ కంపెనీ ధన్యవాదాలు చెప్పింది. 200 మంది స్కై రూట్ సిబ్బంది కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉందని ఆ కంపెనీ ప్రతినిధి పవన్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా భవిష్యత్తులోనూ తమ కంపెనీ విస్తరిస్తుందన్న పవన్, అంతరిక్ష రంగానికి సంబంధించిన విభిన్నమైన రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సపోర్ట్ ఇకో సిస్టం హైదరాబాద్ లో ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందని గుర్తుచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News