హైదరాబాద్: రాబోయే తరాలకు స్వచ్చమైన గాలి, నీరు అందించాల్సిన బాద్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జలాశాఖాదికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సహజసిద్దమైన వనరులైన గాలి, నీరు మనం ముందు తరాల వారికి అందించాలని ప్రతిజీవికి ఇవి ఎంతో అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడ్డక మన ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల ద్వారా భూగర్భ జలాలు స్దాయి భాగా పెరిగాయని తెలిపారు. అంతకు ముందు వర్షపు నీరు వృదాగా సముద్రంలో కలిసేవని, 2014 తరువాత ప్రభుత్వం చేపట్టిన కారక్రమంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణ,గోదావరి నదులపై లిప్టులు నిర్మించి సాగు,తాగు నీటి కార్యక్రమాలకు ఉపయోగించేలా చేయాలని, కలెక్టర్ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో జిల్లా భూగర్భ జలధికారి జగన్నాథరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాదికారి డా. వెంకటి, టీజీవో అధ్యక్షులు ఎంబి. కృష్ణయాదవ్, టీఎన్జీవో అధ్యక్షులు ముజీబ్, జిల్లా అధ్యక్షులు శ్రీరామ్, సహకార శాఖాధికారి నాగార్జున, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.