Saturday, November 16, 2024

హైదరాబాద్ టు శ్రీనగర్‌కు విమాన సౌకర్యం కల్పిస్తాం

- Advertisement -
- Advertisement -

కాశ్మీర్ డిప్యూటీ డైరెక్టర్ మిస్టర్ అహ్సన్ చిస్తి

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ టూరిజం, కాశ్మీర్ టూరిజం ప్రమోషన్‌లపై తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జమ్మూ అండ్ కాశ్మీర్ డిప్యూటీ డైరెక్టర్ అహ్సన్ చిస్తినిలు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా యునెస్కో రామప్ప దేవాలయం, సోమశిల, అనంతగిరి వికారాబాద్, భుద్దవనం ప్రాజెక్ట్ – నాగార్జున సాగర్, లక్నవరం, దుర్గం చెర్వు మొదలైన తెలంగాణ టూరిజం తాజా గమ్యస్థానాల గురించి శ్రీనివాస్‌గుప్తా వారికి వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కాశ్మీర్ డిప్యూటీ డైరెక్టర్ మిస్టర్ అహ్సన్ చిస్తి మాట్లాడుతూ హైదరాబాద్ టు -శ్రీనగర్‌కు విమాన సౌకర్యం కల్పిస్తామని, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చే వారికి ఉచితంగా షూటింగ్ కోసం పర్మిషన్ ఇస్తామని ఆయన హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ వి రమణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News