Monday, December 23, 2024

నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో గురుకుల పాఠశాలలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్ర మైనారిటీ ప్రభుత్వ సలహాదారు, మైనారిటీ గురుకుల అధ్యక్షుడు ఏకే ఖాన్ అన్నారు. శుక్రవారం రంగంపల్లిలోని మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా డార్మరేటరి, భోజనగది, వంట శాల, స్టోర్ రూం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల సంఖ్య ప్రకారం అవసరమైన ఆహారం అందించాలని, పదార్థాలు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. పలు విషయాలను విద్యార్థుల నుండి అడిగి తెలుసుకొని ఆయన సంతృప్తి చెందారు. ఉపాధ్యాయులు విద్యా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వందకు వంద శాతం ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో గురుకుల పాఠశాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి విద్యార్థిని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటి జిల్లా సంక్షేమ శాఖ అధికారి మేరాజ్ మహమ్మద్, విజిలెన్స్ అధికారులు అక్రం పాషా, షౌకత్ అలీ, ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మీ, అస్మాజబిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News