Monday, November 18, 2024

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు సహకారాన్ని అందిస్తా

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : రాష్ట్రంలో వెనుకబడిన ఆర్యవైశ్యులను ఆదుకునేందుకు అవసరమైన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏ ర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి డివిజన్ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యా కమిటీ చైర్మెన్ మిడిదొడ్డి శ్యాం సుందర్, జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, జిల్లా రైస్ మిల్లర్ల అసొసియేషన్ అధ్యక్షుడు జూలూరి రమేష్ బాబు, కల్వకుర్తి వైస్ ఎంపిపి కొండూరు గోవర్ధన్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రీతి పాత్రుడు, స్నేహితులు ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. వైశ్యుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడంతో పాటు వారికి సమస్యలు లేకుండా పాలన చేస్తున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఎల్లప్పుడు కృషి చేస్తానని జిల్లా సహచర ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా కమిటీ చైర్మెన్ మిడిదొడ్డి శ్యాం సుందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు. వైస్ ఎంపిపి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారానే వైశ్యులకు మేలు జరుగుతుందని దాని సాధనే లక్షంగా పనిచేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలుస శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్మిచెర్ల రమేష్, కోశాధికారి జగదీశ్వర్, అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, పిఆర్‌ఓ మిరియాల రాజయ్య, కిరాణం అసొసియేషన్ అధ్యక్షుడు కుమార స్వామి, మెడిశెట్టి సురేష్, ఉప్పు ఆంజనేయులు, వాసవి క్లబ్ కోశాధికారి అశోక్‌త్ పాటు ఎల్లయ్య, కృష్ణయ్య, ప్రభాకర్, నారాయణ రాజు, చంద్రయ్య, శంకర్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News