Saturday, November 23, 2024

రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలి

- Advertisement -
- Advertisement -

Provide timely crop loans to farmers: Harish rao

బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు టి. హరీశ్ రావు కోరారు. సోమవారం బిఆర్‌కెఆర్ భవన్ లో ఎస్‌ఎల్‌బిసి 29వ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో 2021-2022 సంవత్సరానికి సంబంధించి రూ.1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో రూ. 7360 కోట్లు పైగా రైతుబంధు కింద నిధులు జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో బ్యాంకర్లు సిఎం ఆదేశాల అమలుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని మంత్రి కోరారు. తద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించాయని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరింత ముద్రా రుణాలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని బ్యాంకర్లకు తెలిపారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్‌ఎల్‌బిసి ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సిజిఎం వై. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News