Tuesday, January 7, 2025

దళితబంధు లబ్ధిదారులకు సహాకారాన్ని అందిస్తా

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: దళితబంధు పథకాం ద్వారా లబ్దిపొంది యూనిట్లను ప్రారంభించిన లబ్ధిదారులకు వ్యాపారాభివృద్ధికి అవసరమైన సహాకారాన్నందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్ తెలిపారు. సోమవారం జమ్మికుంట మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులు ప్రారంభించిన పలు యూనిట్లను హుజురాబాద్ ఆర్డిఓ, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కొర్రి సరిత మరో ముగ్గురు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించిన శివసాయి ట్రెడర్స్, బోగం రమేష్ యొక్క ఇండియా మ్యూజికల్ బ్యాండ్, వేణు అనే లబ్ధిదారుని ఫ్లెక్సి ప్రింటర్ షాపు, రాచపల్లి స్వామి ప్రారంభించిన గ్లోబల్ స్వచ్ఛ్ ఆర్గానిక్ హేర్భల్ అండ్ న్యూట్రీస్కూటికల్ స్టోర్‌లతో పాటు మరో లబ్ధిదారుడు ప్రారంభించి బ్యాటరీ మోటారు సైకిల్ షాపును పరిశీలించారు.

లబ్ధిదారులు ప్రారంభించిన పలు యూనిట్లు వాటి ద్వారా వచ్చే లాభాల గురించి వాకాబు చేసిన కలెక్టర్ దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ వారి వ్యాపారాభివృద్ధికి కావాలసిన సహాకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ లబ్ధిదారులు ముడిసరుకు కొనుగోలు నేరుగా సంస్థ నుండి తీసుకోవడంలో, షాపుల నిర్వహణకు కావాలసిన అనుమతులను ఇప్పించడంలో పూర్తి సహాకారాలను అందిస్తానని అన్నారు.

రెండవ విడతగా లభించాల్సిన మొత్తాన్ని వెంటనే లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దళితబంధు ద్వారా ప్రారంభించిన ప్రతి యూనిట్ విజయవంతమై నిన్నటి వరకు కూలీలుగా ఒకరి వద్ద పనిచేసిన వారు ఇప్పుడు ఉత్తమ వ్యాపారవేత్తలుగా ఎదిగేలా వారికి కావాలసిన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని భరోసనిచ్చారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డిఓ హరిసింగ్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సురేష్, నాగార్జున, నెహ్రూ యువకేంద్రం, యువజనాధికారి రాంబాబు, తహసీల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీఓ కల్పన, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News