హైదరాబాద్ : శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాధించిన ప్రగతిని మంత్రి హరీశ్‌రావు వివరిస్తూ తన ప్రసంగంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల గురించి పేర్కొనడం హర్షనీయమని పిఆర్‌టియు టిఎస్ పేర్కొంది. ఈసందర్భంగా ఈసంఘం నాయకులు పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ చిరుద్యోగులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30శాతం ఫిట్‌మెంట్ అమలుపరచి రాష్ట్రంలో రెండవ పిఆర్‌సి కమిటీని నియమించి మధ్యంతర భృతిని కూడా ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీరెల్లి కమలాకరావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవ రెడ్డిలు సిఎం కెసిఆర్ సహకరించిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ సంతృప్తిపరచే విధంగా పిఆర్సీ ముఖ్యమంత్రి ప్రకటిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.