Sunday, January 19, 2025

టీచర్లను సొంత జిల్లాలకు తీసుకువచ్చే బాధ్యత పిఆర్‌టియుటిఎస్‌దే

- Advertisement -
- Advertisement -

317 బాధిత ఉపాధ్యాయులకు బీరెల్లి కమలాకర్ రావు భరోసా

హైదరాబాద్ : 317 జిఒ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు తీసుకువచ్చే బాధ్యత తమదే అని పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు భరోసా ఇచ్చారు. పిఆర్‌టియుటిఎస్ నిజామాబాద్ సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం 317 జిఓ వల్ల ఇబ్బందికి గురైన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరవెల్లి కమలాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

317 జిఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులలో కొంతమందిని ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో తమ సొంత జిల్లాలకు తేగలిగామని, మిగిలిన టీచర్లందరినీ తమ సొంత జిల్లాకు తీసుకువచ్చే బాధ్యత ఖచ్చితంగా తమ సంఘానిదే అని హామీ ఇచ్చారు. మార్చి 2024 తర్వాత ఉద్యోగ విరమణలతో ఏర్పడే ఖాళీలతో 317 జిఒ వల్ల వేరే జిల్లాలకు పంపించిన ఉపాధ్యాయులను తీసుకువచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి ఆగస్టు 31 లోపు ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్య ఏదైనా పరిష్కరించే శక్తి కేవలం తమ సంఘానికే ఉందని జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు. సంఘం చేస్తున్న కృషికి, వారు ఇస్తున్న భరోసాకు 317 భావిత ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బాధ్యులు రచ్చ మురళి,కిషన్, సుధాకర్ రెడ్డి,రవీందర్ రెడ్డి,చిలుక శ్రీనివాస్, రవి నాయక్, ప్రసాద్,రామచందర్, రాజశేఖర్, విద్యాసాగర్,డి.హన్మాండ్లు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News