Sunday, January 19, 2025

నేను వాళ్లు వదిలిన బాణాన్ని: పృధ్వీరాజ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాళహస్తి వరకు వైఎస్‌ఆర్‌సిపి పార్టీ తనన వాడుకొని వదిలేసిందని నటుడు పృధ్వీరాజ్ మండిపడ్డారు. టిడిపి నేత లోకేష్ వద్ద రెడ్ డైరీ ఉందని, తన దగ్గర పిఆర్ డైరీ ఉందని, అందరి జాతకాలు బయటకు తీస్తామని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిలు చేసుకోవడంతో పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అని ధ్వజమెత్తారు. వైసిపి నేత అంబటి రాంబాబు ఎప్పుడు మూడు పెళ్లిలు, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడుతారని దుయ్యబట్టారు.

అంబటి రాంబాబుకు అసలు ప్రాజెక్టులు అంటే తెలుసా? అని ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని తాను అని చెప్పారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. ఎపి మంత్రులు సినిమాల్లో డ్యాన్సులు, కలెక్షన్లు, డిస్టిబ్యూటర్ల గురించి మాట్లాడుతారా? అని పృధ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికలలో జనసేన, టిడిపి 136 స్థానాలలో గెలిచి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 21 ఎంపి స్థానాలు గెలిచి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని పృధ్వీరాజ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News