Sunday, December 22, 2024

‘పొన్నియిన్ సెల్వన్’ అద్భుతం సృష్టిస్తుంది

- Advertisement -
- Advertisement -

PS-1 Movie Pre Release event in Hyderabad

చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం ఈ నెల 30న విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ.. “ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, కార్తికేయ 2 చిత్రాల్లాగే ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని భావిస్తున్నా.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఇంతమంది హీరోహీరోయిన్‌లను పెట్టి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించడం చాలా గొప్ప విషయం” అని అన్నారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ “నా డ్రీమ్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా పాత్రలను అందంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో అందరూ హీరోలే.. అందరూ హీరోయిన్లే”అని తెలిపారు. ఐశ్వర్యారాయ్ మాట్లాడుతూ “నా మొదటి చిత్రం ‘ఇద్దరు’ మణిరత్నంతో చేశాను. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ నేను భాగం కావడం ఆనందంగా ఉంది” అని చెప్పారు. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ “ఈ సినిమాలోని పది శాతం చెన్నైలో చిత్రీకరణ జరిగితే మిగతాదంతా రాజమండ్రి, హైదరాబాద్‌లో ప్రాంతాల్లో చేశాం. దీనిని తెలుగు సినిమాగా భావించి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తీ, త్రిష, ఏ.ఆర్.రెహమాన్, శరత్‌కుమార్, జయం రవి, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

PS-1 Movie Pre Release event in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News