Sunday, December 22, 2024

వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించబోతున్నాము

- Advertisement -
- Advertisement -

PS-1 was released on September 30

ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్, మడ్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానుంది పొన్నియిన్ సెల్వన్. పీయస్-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఒకే సమయంలో విడుదల చేయనున్నారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ చిత్రంలో నుంచి చోళ చోళ అనే పాటను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో మణిరత్నం మాట్లాడుతూ.. “చిరంజీవికి థాంక్స్ చెప్పాలి. ఎందుకనేది తరువాత మీకే తెలుస్తుంది. రాజమౌళికి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే ధైర్యం వచ్చింది. నా బిడ్డ లాంటి ఈ చిత్రం ఇక దిల్ రాజుదే. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలి” అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. “కంటెంట్ బాగుంటే ఎక్కడి నుంచి వచ్చిందని చూడకుండా ఇండియా మొత్తం ఆదరిస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు. చియాన్ విక్రమ్ మాట్లాడుతూ “మణిరత్నంతో సినిమా చేస్తున్నానంటే అది నాకు కల నెరవేరడం వంటిది. ఈ సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌”అని పేర్కొన్నారు. కార్తీ మాట్లాడుతూ “ఈ కథ నేల మీద, సముద్రాలు, అడవుల్లో జరుగుతుంది. ఇలాంటి చిత్రాలు తీయాలంటే మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ ఉండాలి. అప్పట్లోని రాజకీయాల మీద ఈ చిత్రం ఉంటుంది. రియల్ కారెక్టర్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతోన్నాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుహాసిని, ప్రకాష్ రాజ్, నాజర్, తనికెళ్ల భరణి, అనంత శ్రీరాం పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News