Friday, March 21, 2025

పిఎస్‌ఎల్ టీం నిర్వాకం.. రోహిత్ శర్మకు అవమానం

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ సూపర్ లీగ్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి అతిథ్యమిచ్చిన పాకిస్థాన్ ఆ టోర్నమెంట్‌లో లీగ్ దశలో నిష్క్రమణ, భారత్ విజేతగా నిలవడం.. వంటి సంఘటనలతో తీవ్ర అవమానాలు ఎదురుకుంటుంది. తాజాగా భారత్‌పై మరోసారి అక్కస్సును వెల్లగక్కింది. పిఎస్‌ఎల్‌కి చెందిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మస్కట్ మీడియాతో మాట్లాడుతున్నట్లుగా ఉండగా.. దానికి రోహిత్ శర్మ వాయిస్ ఓవర్‌ని జత చేసింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లిష్ మాట్లాడిన తీరు ఓ వీడియో వైరల్ అయింది. ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ దీనిపై హస్యాస్పదంగా రిజ్వాన్‌ను అనుకరిస్తూ.. మాట్లాడాడు. దీనిపై పాక్ క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ కెప్టెన్‌ను ఇలా అంటారా? అని కామెంట్లతో దాడి చేశారు. మరి ఇప్పుడు భారత కెప్టెన్‌ గురించి ఇలా చేయడాన్ని భారత అభిమానులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ‘రిజ్వాన్ విషయంలో బ్రాడ్ హాగ్ చేసింది సరైంది కాదు.. మరి ఇప్పుడు ముల్తాన్ సుల్తాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ని ఇలా అవమానిస్తారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News