పహల్‌గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌కు ఒకదాని తర్వాత మరోక షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్ తగిలింది. అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రసారాలను భారత్‌లో నిలిపివేయబడ్డాయి. ఈ లీగ్‌ని భారత్‌లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ.. పిఎస్‌ఎల్ మిగిలిన మ్యాచ్‌లను భారత్‌లో ప్రసారం చేయడం లేదని వెల్లడించింది.
పిఎస్‌ఎల్ కోసం పాకిస్థాన్‌లో ఉంటూ.. ప్రసారానికి సంబంధించి వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని పాక్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన రెండు డజన్ల మంది పిఎస్‌ఎల్‌లో ఇంజనీర్లుగా, ప్రొడక్షన్ మేనేజర్లుగా, కెమెరామెన్లుగా, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్‌పర్ట్‌లుగా పని చేస్తున్నారు. వీరందరూ మరో రెండు రోజుల్లో భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. వీరందరూ రావడం పిఎస్‌ఎల్‌కు పెద్ద దెబ్బే అని నిపుణులు అంటున్నారు.