Monday, December 23, 2024

దిగంతాలకు ‘తెలంగాణ కీర్తి’

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి.హబ్ సభ్యులు తమ ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మొన్న, నిన్న విజయవంతమైన ఉప గ్రహ ప్రయోగాలు రాష్ట్ర ఘన కీర్తిని అంతరిక్షంలోకి మోసుకుపోయాయి.
                                                                                           సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాల ప్రతిభను వెలికితీసి, ఆకాశమే హద్దుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ దేశ స్టార్టప్ చరిత్రలో, అంతరిక్షంలోకి ప్రయివేటు ఉపగ్రహాల ప్రయోగ చరిత్రలో మరో రికార్డును సృష్టించింది. రాష్ట్రానికి చెందిన ‘ధృవ’ స్పేస్‌టెక్ ప్రయివేట్ సంస్థ రూపొందించిన రెండు నానో శాటిలైట్స్‌ను శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి సి54 రాకెట్ విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టిం ది. దీనిపై సిఎం కెసిఆర్ స్పందిస్త్తూ.. పెద్దఎత్తు న హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప లు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఐటి, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఏ రాష్ట్రం సాధించని విధంగా అంతరిక్షంలోనూ ఘన విజయాలు సాధిస్తుండడం పట్ల ఆనందంగా ఉందన్నారు.

ఇస్రోకు చెందిన “పిఎస్‌ఎల్‌వి సి54 ” తో పాటుగా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ధృవ స్టార్టప్ సంస్థ పంపిన “తైబోల్ట్… 1,తై బోల్ట్ 2” అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔ త్సాహిక అంకుర సం స్థల చరిత్ర లో సుదినంగా సిఎం పే ర్కొన్నారు. ప్రైవేట్ రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజ యం అన్నా రు. టి.హబ్ సభ్య సంస్థ అయిన, స్కైరూట్’ స్టార్టప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన “విక్రమ్…-ఎస్‌” సాటిలైట్ విజయవం తం కా వడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగా ల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ కంపెనీ మొట్ట మొద టి సంస్థగా చరిత్రను లిఖించిందని సిఎం అ న్నారు.ఈ ప్రయోగాలతో భారత అంతరిక్షరంగంలో హైదరాబాద్ అంకుర సంస్థలు ద్వారాలు తెరిచాయని సిఎం పేర్కొన్నారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి మొన్నటి విక్రమ్…ఎస్, ప్రస్తుత “తై బోల్ట్..1, తై బోల్ట్.. 2, ప్రయోగాల విజయం శుభారంభాన్ని ఇచ్చిందని సిఎం అన్నారు.

విజయం సాధించిన ఈ రెండు ఉప గ్రహ ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయన్నారు. ఈ ఉప గ్రహ ప్రయోగాల ద్వారా స్టార్టప్స్ సిటీగా హైదరాబాద్‌కు ఉన్న విశిష్టత రెట్టించిందని సిఎం అన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితేయడం, పరిశ్రములు,శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టి…హబ్‌లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్ళు సాధిస్తాయనే నమ్మకం తనకుందని సిఎం అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. టి హబ్ ప్రోత్సాహంతో తమ స్టార్టప్ సంస్థల ద్వారా ఉప గ్రహాలను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించి తెలంగాణ కీర్తిని చాటిన ‘స్కైరూట్’ , ‘ధృవ’ స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ శుభాకాంక్షలను తెలిపి అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికోసం వెచ్చించి భారత దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రతిభతో రాష్ట్ర యువత అద్భుతాలు సృష్టిస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి…హబ్‌లో సభ్యులైన యువత తమ ప్రతిభతో నేడు అద్భుతాలు సృష్టిస్తోందని కెసిఆర్ కొనియాడారు. మొన్న, నేడు విజయవంతమైన ఉప గ్రహ ప్రయోగాలు రాష్ట్ర ఘన కీర్తిని అంతరిక్షంలోకి మోసుకుపోయాయన్నారు. స్కైరూట్ ఏరో స్పేస్ ప్రయివేట్ లిమిటెడ్‌” అనే అంకుర సంస్థ దేశంలో మొట్టమొదటిసారి రూపొందించి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రయివేట్ రాకెట్ “ విక్రమ్ – ఎస్‌” ప్రయోగం ఇటీవలేనే విజయవంతమైందన్నారు. ఇది తెలంగాణ హార్డ్‌వేర్ ఇంక్యూబేటర్ టి వర్క్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ టి…హబ్ స్టార్టప్ సంస్థ అని అన్నారు. మొన్నటి ప్రయోగం విజయవంతం కావడాన్ని దేశమంతా చర్చించుకుంటుండగానే తాజాగా నగరానికి చెందిన మరో తెలంగాణ స్టాటప్ కంపెనీ చేత అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చోటు చేసుకున్నదన్నారు.

శ్రీహరి కోటనుంచి ధృవ’ స్పేస్ సంస్థ పంపిన మరో రెండు సాటిలైట్లు విజయవంతం అయ్యాయి. దాంతో మరోసారి దేశమంతా హర్షాతిరేకాలు మిన్నుముట్టాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో స్టార్టప్ కంపెనీలు సాధించిన ఘనతను ప్రపంచమంతా కొనియాడుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు వారి అద్భుతమైన ఆలోచనకు తమ అంకుర సంస్థల ద్వారా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. శాస్త్ర సాంకేతిక ఐటి రంగాల్లో ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న యువనేత, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావును, ఉన్నతాధికారులను టి..హబ్ సిబ్బందిని సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News