- Advertisement -
హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పిఎస్‌ఎల్‌వి సి52 ప్రయోగం విజయవంతమైంది. 25.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా ఉదయం. 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 18.31 నిమిషాల పాటు ప్రయాణించిన రాకెట్ అనంతరం 1710 కిలోల బరువున్న ఐఆర్ ఎస్ఎటి-1 తోపాటు మరో రెండు ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలు 10 ఏళ్ల పాటు వ్యవసాయం, అటవీ, నీటివనరుల నిర్వహణ, వరదలపై విలువైన సమాచారం అందించనున్నాయి.
- Advertisement -