Friday, December 13, 2024

నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్ వి  సి-59

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరోకోటలోని స్పేస్‌పోర్ట్ నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగించింది. బుధవారం, ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టమ్‌లో క్రమరాహిత్యం కనుగొనబడిన నేపథ్యంలో ప్రయోగం మళ్లీ షెడ్యూల్ చేసింది. భారత అంతరిక్ష సంస్థ దీనిని భారతదేశానికి గర్వకారణంగా పేర్కొంది.

‘‘లిఫ్టాఫ్ సాధించాం! పిఎస్ఎల్ వి – సి59 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.ఎన్ఎస్ఐఎల్ నేతృత్వంలో గ్లోబల్ మిషన్ ప్రారంభం అయింది. ప్రోబా-3 ఉపగ్రహాలను పంపించాం. అంతర్జాతీయ సహకారం, భారత కొలాబరేషన్, అంతరిక్ష విజయాలను కీర్తిస్తున్నై’’ అంటూ ఇస్రో ట్వీట్ చేసింది.

సూర్యుడి ఉపరితలంపై ప్రోబా-3 అధ్యయనం చేయనున్నది. ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం 310 కిలోల కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కిలోల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ను నింగిలోకి పంపారు. ఈ రాకెట్ ను 550 కిలోల బరువుతో ఇన్-ఆర్బిట్ డెమోనిస్ట్రేషన్ లక్ష్యంగా ప్రయోగించారు. యూరోపియన్ అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో అధికారులు సంయుక్తంగా దీనిని ప్రయోగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News