Wednesday, January 22, 2025

ఒక సైకో కథ: సింహం బోనులోకి దూకి… భార్య తల నరికి!

- Advertisement -
- Advertisement -

వాడొక సైకో. ఎప్పుడేం చేస్తాడో వాడికే తెలియదు. అలాంటివాణ్ని పిచ్చాసుపత్రిలో చేర్పించకుండా వీధుల్లో వదిలేస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది!

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ లో ఈ నెల 14న ఓ దారుణం జరిగింది. గౌతమ్ గుచ్చైత్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన భార్యతో గొడవపడి, కోపం పట్టలేక ఆమె తల నరికేశాడు. అంతటితో ఆగకుండా, భార్య తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరుగుతూ భయోత్పాతం సృష్టించాడు. దాదాపు రెండు గంటల సేపు అతను అలా భార్య తలను చేతిలో పట్టుకుని తిరిగాడు. చివరకు పోలీసులు అతన్ని పట్టుకుని, కటకటాల వెనక్కి నెట్టారు. అతని తల్లిదండ్రుల్ని పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా, తమ కొడుక్కి మానసిక స్థిరత్వం లేదనీ, ఎప్పుడేం చేస్తాడో తెలియదని చెప్పారు.

గౌతమ్ గురించి ఆరా తీస్తే అతను గతంలో చేసిన మరొక ఘనకార్యం బయటపడింది. గౌతమ్ 2021లో కోల్ కతాలోని అలీపూర్ జూని చూసేందుకు వచ్చాడు. వచ్చినవాడు జంతువుల్ని చూసి వెళ్లకుండా, పద్నాలుగు అడుగుల ఎత్తున్న జూ గోడను ఎక్కి, లోపలకి దూకాడు. ఆ తర్వాత ఇనుప తీగెలతో ఉన్న రెండు కంచెలను కూడా దాటి, సింహం బోనులోకి అడుగుపెట్టాడు. రెండు క్షణాలు ఆగితే, అతన్ని సింహం చంపేసేదే. ఈలోగా అప్రమత్తమైన జూ అధికారులు వెంటనే గౌతమ్ ను బయటకు లాగేశారు.

మానసిక స్థిరత్వం సరిగా లేదని తెలిసి, అతనికి చికిత్స చేయించకుండా ఉపేక్షించడం వల్ల అన్నెం పున్నెం ఎరుగని భార్య ప్రాణాలు కోల్పోయిందని గౌతమ్ ఇంటి చుట్టుపక్కలవారు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News