- Advertisement -
తిరుపతి: ఓ సైకో ఇనుప రాడ్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కొన్ని ఇళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో తిరుపతి నగర వాసులు భయాందోళనకు గురయ్యారు. ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ నగర్ కాలనీలో అర్ధరాత్రి ఓ సైకో ఇనుప రాడ్‌తో తిరుగుతూ కొన్ని ఇళ్ల అద్దాలను ధ్వంసం చేశాడు. తర్వాత తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలోకి చొరబడ్డాడు కానీ ఇళ్లలో ఏమీ దొంగిలించలేదు. వీధిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో అతడి కదలికలు రికార్డయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు. అతను చెడ్డీ గ్యాంగ్‌కు చెందినవాడని అనుమానిస్తున్నారు.
- Advertisement -